పెళ్లికి ముందే కాలుజారిన స్టార్ హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్?

అకింత లోఖాండే.. సీరియల్ నటిగా బుల్లితెరకు పరిచయమై కంగనా నటించిన మణికర్ణిక చిత్రంతో బాలీవుడ్ వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన భామ.. ఇక దీనికన్నా దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ‘పవిత్ర రిష్తా’ సీరియల్ టైమ్ లో వీరిద్దరి ప్రేమ చిగురించడం .. ఆ తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో రిలేషన్ కి బ్రేకప్ చెప్పేశారు . ఇక సుశాంత్ బ్రేకప్ తరువాత 2019లో తాను విక్కీ జైన్‌తో ప్రేమలో పడినట్టు ప్రకటించింది అంకిత.

ఇటీవల ప్రేమించినవాడితో ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఈ భామ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందట.. అంటే పర్మినెంట్ గా కాదు.. కొద్దిరోజులు వాయిదా పడింది.. దీనికి కారణం అంకిత కాలుజారడమే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. తాజాగా అంకిత తన ఇన్స్టాగ్రామ్ లో కాలికి కట్టుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ‘టాక్ టూ మై ఫుట్!’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అమ్మడి కాలికి ఏదో దెబ్బ తగలడంతో కట్టు కట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ లో జరగబోయే వీరి వివాహాన్ని కొద్దిగా ముందుకు జరిపినట్లు సమాచారం. ఇక అంకిత కాలికి దెబ్బ ఎలా తగిలింది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఫోటోపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళికి ముందే కాలు జారావా ..? అని కొందరు.. పెళ్లి అనుకుంటే ఇలా బెడ్ పై పడిపోయావేంటి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Latest Articles