పెళ్లి వార్తలపై ‘వకీల్ సాబ్’ బ్యూటీ రియాక్షన్

తెలుగమ్మాయి అంజలి ఇటీవలే “వకీల్ సాబ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోని ఒక ప్రధాన పాత్రలో అంజలి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ హోమ్లీ బ్యూటీకి గాసిప్ లతో ఇబ్బంది తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా నటి అంజలి ఈ ఏడాది చివరి నాటికి వివాహం చేసుకోబోతోందని పుకార్లు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై స్పందించిన అంజలి తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేసింది. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపై మాత్రమే ఉందని, రానున్న రోజుల్లో మంచి పాత్రలు పోషించాలని అనుకుంటున్నాను అని తెలిపింది. చిత్రనిర్మాతలను మంచి పాత్రల కోసం తనను సంప్రదించడం లేదని, మంచి ఆఫర్లు వచ్చే వరకు వేచి ఉంటానని నటి చెప్పుకొచ్చింది. ‘వకీల్ సాబ్’ విడుదలైన తరువాత అంజలి ఇంకా ఇతర ప్రాజెక్టుపై సంతకం చేయలేదు. కానీ ఆమె రెండు పెద్ద ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-