‘యానిమల్’ ని రంగంలోకి దింపనున్న సందీప్ వంగా.. రిలీజ్ ఎప్పుడంటే..?

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 11 ఆగస్టు, 2023 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సందీప్ రెడ్డి వంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం పలు కారణాల వలన మధ్యలో వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మనుషుల్లో ఉండే జంతు స్వభావాన్ని, క్రూరత్వాన్ని చూపిస్తానని సందీప్ ఇదివరకే చెప్పాడు. మరి ఈ సినిమాతో సందీప్ బాలీవుడ్ లోను సెన్సేషన్ సృష్టిస్తాడేమో చూడాలి.

Related Articles

Latest Articles