హైపర్ యాక్టివ్ అవుతున్న యానీ!

బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి నుండి ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్న యాని మాస్టర్ సైతం తనకంటూ ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది. శ్రీరామ్ సలహా మేరకు సన్నీ, రవితో కాస్తంత క్లోజ్ గా మూవ్ అవుతోంది. అదే సమయంలో మానస్ కు, యానీకి మధ్య దూరం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ వారం నామినేషన్స్ లో మానస్ – యానీ పరస్పరం నామినేట్ చేసుకున్నారు. ఇక కాజల్, యానీ మధ్య అయితే పెద్ద యుద్ధమే సాగుతోంది. సిరి తనను బాహాటంగా విమర్శించడాన్ని తట్టుకోలేక పోయిన కాజల్ రవి దగ్గర కంట నీరు పెట్టుకుంది. అతను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అదే విషయాన్ని యానీ దగ్గర చెప్పినప్పుడు ఆమె లైట్ తీసుకుంది.

Read Also : ట్రైలర్ : రూపాయ్ పాపాయ్ లాంటిదిరా… దాన్నెలా పెంచి పెద్ద చేయాలంటే…!

‘కన్నీళ్ళు పెట్టుకుని ఎవరి దగ్గర కాజల్ మార్కులు కొట్టేయాలని చూస్తోంది. నోరు ఉంది కదాని విమర్శించడం, ఆ తర్వాత కన్నీళ్ళు పెట్టుకోవడం కాజల్ కు కామన్’ అంటూ యానీ బదులిచ్చింది. మిగిలిన వాళ్ళ విషయంలో చూసి, చూడనట్టు ప్రవర్తించే యానీ మాస్టర్ కాజల్ దగ్గరకు వచ్చే సరికీ హైపర్ యాక్టివ్ అయిపోతోంది. కాజల్ ను ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేయడం, ఆమెను నాగినితో పోల్చడం, ఎద్దేవా చేస్తూ డాన్స్ చేసి, ఆ తర్వాత ‘నేను ఎవరినీ ఉద్దేశించి ఇలా చేయడం లేదు, నేను కొరియోగ్రాఫర్ ను కాబట్టి డాన్స్ చేశాను’ అని చెప్పడం కాస్తంత అతిగానే అనిపిస్తోంది. దానికి తోడు గత రెండు వారాలుగా ఆమెలో తెలియని ఓ అసహనం కూడా బయటపడుతోంది. టాస్క్ లలో గట్టి పోటీని ఇవ్వడంతో పాటు తనకు నచ్చని విషయాలను కన్వెన్సింగ్ గా కాకుండా ముఖం మీద కొట్టినట్టు చెబుతోంది. మరి ఈ వ్యవహారం చూస్తుంటే, వీక్షకులు ఈ వారం యాని మాస్టర్ ను ఇంటికి పంపుతారేమో అనిపిస్తోంది! లెట్స్ వెయిట్ అండ్ వాచ్!!

Related Articles

Latest Articles