కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రాజెక్టుల అప్పగింత.. ఉత్తర్వులు జారీ.. కానీ..!

కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవాళ్టి నుంచి అమల్లోకి రావాల్సిన సమయంలో.. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది.. అయితే, గెజిట్ ప్రకారం బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది… అయితే, తన ప్రాజెక్టులను తెలంగాణ అప్పగించిన తర్వాతనే ఈ జీవో అమల్లోకి తేవాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. నోటిఫికేషన్ లోని రెండో షెడ్యూలు ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, రివర్ స్లూయిస్ తో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రినీవా, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను అప్పగింతకు సిద్ధమని ప్రకటించింది. అయితే, తెలంగాణ కూడా ప్రాజెక్టులను స్వాధీనం చేస్తేనే తాము కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తామని స్పష్టం చేసింది.

నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ్టి నుంచే ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకారం తెలియచేస్తున్నట్టు తెలిపింది ఏపీ ప్రభుత్వం.. ప్రాజెక్టుల్లోని భవనాలు, ఇతర కట్టడాలు, యంత్ర సామాగ్రి ఎక్కడివక్కడ ప్రాతిపదికన అప్పగింతకు సిద్ధమని ఉత్తర్వుల్లో పేర్కొంది.. శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుపై కూడా నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీని కోరిన ఏపీ సర్కార్.. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే ప్రవాహాలను ప్రభావితం చేసే ప్రాజెక్టుగా జూరాలను కూడా కేఆర్ఎంబీ తన స్వాధీనంలోకి తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలూ నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తైన తర్వాత వాటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని కోరింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

-Advertisement-కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రాజెక్టుల అప్పగింత.. ఉత్తర్వులు జారీ.. కానీ..!

Related Articles

Latest Articles