Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Vice President Of India
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Ysrcp Leaders Focus On Badvel Majority

బద్వేల్ లో వైసీపీకి భారీ మెజారిటీ!

Published Date :November 1, 2021
By GSN Raju
బద్వేల్ లో వైసీపీకి భారీ మెజారిటీ!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప పోరు రసవత్తరంగా సాగింది. అయితే, తెలంగాణలోని హుజురాబాద్ తో పోలిస్తే ఏపీలోని బద్వేలులో అంతగా జనం ఆసక్తి చూపించలేదు. బద్వేల్ లో టీడీపీ, జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో పోటీ అంతగా కనిపించలేదు. అధికార వైసీపీ అభ్యర్ధిని పరిగణనలోకి తీసుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 9 శాతం తక్కువగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 76.37 శాతం నమోదు కాగా.. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం 68.12గా నమోదైంది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టరు దాసరి సుధ, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్, కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మతో పాటు మరో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

పోలింగ్ ముగిసిన అనంతరం.. ఎన్నికల అధికారులు ఈవీఎంలను బద్వేల్ బాలయోగి గురుకుల పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్‌కి తరలించారు. మంగళవారం ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ పోలింగ్ శాతం తగ్గడానికి వాతావరణ పరిస్థితులు కూడా ప్రధాన కారణం అంటున్నారు. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచి వర్షాలు పడుతుండటంతో ఓటర్లు చురుకుగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అట్లూరు మండలంలో సోమశిల బ్యాక్ వాటర్‌తో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుకుని మరీ కొందరు ఓటర్లు తమ ఓటేశారు.

బద్వేలు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,292 కాగా… వారిలో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది, థర్డ్‌ జండర్‌ 22 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 77.64 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. అప్పుడు 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఈసారి వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ పోటీలో వుండడంతో అధికార పార్టీ నేతలు ప్రచారం చేశారు. గెలుపు గ్యారంటీ కావడంతో అంతగా శ్రమించిన దాఖలాలు లేవు. చెదురుమదురు ఘటనలే నమోదయ్యాయి. వైసీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారితో దొంగ ఓట్లు వేయించారని బీజేపీ నేతలు ఆరోపించారు. టీడీపీ పోటీలో లేకున్నా బీజేపీకి సహకరించిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

బద్వేల్‌ ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్‌ సుధ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అడుగుతామన్నారు. ప్రజాక్షేత్రంలో..ప్రజాతీర్పు కోరేందుకు టీడీపీ వెనుకడుగు వేస్తుందని విమర్శించారు. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా విపక్షాలు పని చేస్తున్నాయని మండిపడ్డారు.

2019 బద్వేల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్యకి 44 వేల మెజారిటీ వచ్చింది. అదే మెజారిటీ ఉప ఎన్నికల్లో కూడా రావాలని సీఎం వైయస్‌ జగన్‌ నిశానిర్దేశం చేశారు. వారసత్వ రాజకీయాలు..మరొకటి అనుకున్నా కూడా..చనిపోయిన చోట ఆ కుటుంబ సభ్యులు పోటీలో ఉండటం సహజంగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి టీడీపీ, జనసేన పోటీ చేయలేదు. కానీ బీజేపీ, కాంగ్రెస్ బరిలో వుండడం, మరికొందరు ఇండిపెండెంట్లు పోటీచేయడంతో ఎన్నిక తప్పలేదు. తిరుపతి తరహాలోనే బద్వేల్ ఎన్నికల ప్రచారంలో సీయం జగన్ పాల్గొనలేదు. నియోజకవర్గ ఓటర్లకు జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయనేది హాట్ టాపిక్ అవుతోంది. రెండు జాతీయ పార్టీలకు డిపాజిట్లు దక్కుతాయా? పరువు నిలుస్తుందో చూడాలి.

  • Tags
  • Badvel By Election
  • BIG MAJORITY
  • cm jagan
  • dr sudha
  • ysrcp vs bjp

WEB STORIES

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

Home Minister Live : Taneti Vanitha Press Meet at Rajahmundry

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

CM Jaganmohan Reddy: రైతులకు కనీస మద్ధతుధర ఇవ్వాల్సిందే

Buddha Venkanna: వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి

CPI Ramakrishna: వరద బాధితుల్ని ఆదుకోవడంలో విఫలం

తాజావార్తలు

  • MLA Jaggareddy : నిన్న మొన్న పుట్టిన వాళ్ళు కాంగ్రెస్ ఏంచేసిందని మాట్లాడుతారు

  • Darshan: నేను తలుచుకుంటే కనపడకుండా పోతావ్ అంటూ నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో

  • Sourav Ganguly: మహిళల జట్టుపై గంగూలీ చేసిన ట్వీట్ మిస్ ఫైర్.. ఆడుకుంటున్న నెటిజన్‌లు

  • Pooja Hegde: పూజా కాళ్లను వదలనంటున్న కుర్రాళ్లు..

  • Mukesh Khanna: అలా అడిగిన వాళ్లు ఆడవారు కాదు వ్యభిచారులు.. శక్తిమాన్ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions