WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • konaseema
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News No Covid Rules In Tirumala Templs For Vips

కొండపై సామాన్యులకేనా రూల్స్‌ ?

Updated On - 07:55 PM, Mon - 17 January 22
By GSN Raju
కొండపై సామాన్యులకేనా రూల్స్‌ ?

తిరుమలలో కోవిడ్ నిబంధనలు సామాన్య భక్తులుకేనా? VIPలకు లేని ఆంక్షలు వారికే ఎందుకు? ముక్కోటి ఏకాదశి మొదలుకొని.. మిగతా రోజులవరకు కోవిడ్ పేరుతో సామాన్యలు శ్రీవారి దర్శనానికి దూరం కావాల్సిందేనా?

ఏడాదిన్నరగా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరం..!
అఖిలాండకోటికి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండలస్వామి దర్శనం కోసం ఎన్ని ప్రయాసలు ఎదురైనా ఆనందంగా భరిస్తారు భక్తులు. వారికి కావల్సిందల్లా.. శ్రీవారి దర్శనమే. అందుకే సామాన్య భక్తులకు ఎలాంటి ప్రణాళికలు.. సిఫారసులు ఉండవు. తమను గట్టెక్కించే స్వామివారు గుర్తుకొస్తే చాలు తిరుమల వచ్చేస్తారు. స్వామివారిని దర్శించుకుని.. ఆ సమయంలో కలిగే దివ్యానిభూతితో తిరుగు ప్రయాణం అవుతారు భక్తులు. కానీ.. ఏడాదిన్నర కాలంగా సామాన్య భక్తులకు శ్రీవారు దూరం. ఈ మాట అనేకంటే TTDనే అంచెలంచెలుగా దూరం చేస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల్లో 60-70 శాతం సామాన్యులే. కోవిడ్ ఆంక్షల పేరుతో కనీసం ఆరు శాతం సామాన్యులు కూడా శ్రీవారిని దర్శించుకోవడం లేదు.

కరోనా ఆంక్షలు సామాన్య భక్తులకేనా?
కోవిడ్ మొదలైనప్పటి నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాల నియంత్రణ కొనసాగుతోంది. ఈ ఆంక్షలు కూడా ఒకవైపే అన్నట్టుగా మారిపోయింది. ప్రస్తూతం 30-40 వేలమంది భక్తులను దర్శనానికి అనుమతిస్తూన్నా.. అవన్నీ ఆన్‌లైన్‌లో కేటాయిస్తున్నవే. సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నా.. సామాన్యులకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సంపన్నులుతో పోటి పడి దర్శనం టికెట్లు పొందే సామర్థ్యం సామాన్యులకు లేదనే వాదన ఉంది. ఆఫ్‌లైన్‌లో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలి అంటే మాత్రం కోవిడ్‌ అడ్డొస్తోంది. కరోనా ఆంక్షలు పాటించాల్సి ఉన్నా.. వాటిని సామాన్య భక్తులకే వర్తింప చేయడంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై నియంత్రణ లేదు
తిరుమలలో రోజూ సిఫారసు లేఖలపై VIP బ్రేక్‌ దర్శనాలను… ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్నారు. వాటిపై నియంత్రణ లేదు. ఆ టికెట్ల సంఖ్య తగ్గించలేదు. పైపెచ్చు వాటి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లో కేటాయిస్తున్నా.. గతంతో పోల్చితే వీటి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకి 18-20 వేల టికెట్లు జారీ చేయగా..ప్రస్తుతం 20-25 వేల వరకూ ఉంటోంది. వర్చువల్ సేవా టికెట్లు, సుపథం టికెట్లు.. ఇలా ఎక్కడా ఆ వర్గాలకు కోత లేదు. సమస్యంతా సామాన్య భక్తులదే అన్నట్టుగా వారి సంఖ్యని TTD పూర్తిగా కట్టడి చేసింది. గతంలో రోజుకి 30-50 వేలమంది సామన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ప్రస్తుతం సామాన్యులకు ఇస్తున్న టోకెన్లు పదివేలే. అదీ ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది TTD.

వీఐపీ టికెట్ల కోసం గుమిగూడితే కోవిడ్‌ వ్యాప్తి చెందదా?
సామాన్య భక్తులకు తిరుపతిలో దర్శనం టోకెన్లు జారీ చేస్తే.. వాటిని పొందే క్రమంలో కోవిడ్ వ్యాప్తి చెందుతుందని TTD హడలిపోతోంది. అయితే VIP టికెట్ల కోసం MBC వద్ద నిత్యం భక్తులు గుమిగూడినప్పుడు కానీ.. వాళ్లంతా దర్శనానికి వెళ్లే సమయంలో కానీ కరోనా ప్రబలదట. ఎందుకో TTDనే చెప్పాలి. వైకుంఠ ఏకాదశి రోజున VVIPల పేరుతో జరిగిన హడావిడి కానీ.. వాళ్లంతా దర్శనానికి వెళ్లిన సమయంలో కానీ.. ఎక్కడా కోవిడ్‌ నిబంధనలు పాటించలేదు. ఆంక్షలు అమలవుతున్నాయో లేదో పట్టించుకోలేదు. అదే సామాన్య భక్తుల దగ్గరకు వచ్చేసరికి నిబంధనల కొరడా ఝుళిపిస్తున్నారు. కొండపై సామాన్యులకే ప్రాధాన్యమనే మాటను మాటలకే పరిమితం చేసి.. పెద్దలను ఒకలా.. సాధారణ భక్తులను మరోలా చూడటమే విమర్శలకు తావిస్తోంది.

  • Tags
  • covid protocols
  • covid Rules
  • ministers
  • no common pilgrims
  • off the record

RELATED ARTICLES

Somu Veerraju: హిందూ మనోభావాలను కించ పరుస్తున్నారు..!

Tirumala Hanumanjayanthi:తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపే అన్ని టికెట్లు విడుదల..

Tirumala: శ్రీవారి భక్తులకు గమనిక.. రేపు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల

Tirumala: స్వధర్మ వాహిని ట్రస్ట్ లోగో ఆవిష్కరణ

తాజావార్తలు

  • LIVE : YCP MLA Kodali Nani Fires on Chandrababu

  • Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

  • Kodali Nani: చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన గ్రహం

  • Chandrababu: మహానాడులో బాబు బిజీ… నితిన్ గడ్కరీకి బర్త్ డే విషెస్

  • ఛీ ఛీ.. నీచం.. విమానం నడుపుతూ శృంగారం.. ఫ్లైట్ ను గాలికి వదిలేసి

ట్రెండింగ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

  • Viral Video: ప్యాంట్ ఊడింది.. పరువు పోయింది

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

  • WhatsApp : ఇక నుంచి ఆ ఐఫోన్లలో వాట్సాప్ బంద్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions