ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ప్రభుత్వం బిల్లుని ఉపసంహరించుకోవడం… మళ్ళీ సమగ్రంగా బిల్లుని ప్రవేశపెడతామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో రాష్ర్ట మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజధానుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా విశాఖ పరిపాలనా రాజధానిగా కొనసాగుతుందన్నారు.
రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చంద్రబాబు కుట్ర చేసారు. ప్రభుత్వం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంది. అమరావతి రైతులు అర్ధం చేసుకోవాలన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను అమరావతి రైతులు అడ్డుకుంటే ఉత్తరాంధ్ర ఉద్యమిస్తుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చంద్రబాబు చవిచూస్తారన్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఐఅర్ 27 శాతం ఇచ్చాం. ఉద్యోగులను ఆదుకుంటాం అన్నారు. పీఆర్సీ పర్సంటేజ్ పెంచాలని ఉద్యోగులు కోరారని, ఉద్యోగుల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం వెలువడుతుందన్నారు.