నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని నేను చూసుకుంటానంటున్నారు లాన్స్ నాయక్ సాయి తేజ సోదరుడు మహేష్.సాయితేజ లేని లోటు తమ కుటుంబానికి తీరని లోటని అని సాయి సోదరుడు మహేష్‌బాబు అన్నారు. అన్న స్ఫూర్తితోనే తాను ఆర్మీలోకి వెళ్లానని మహేష్ తెలిపారు. అన్నకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారిని తాను బాగా చూసుకుంటానన్నారు. ఆర్మీలో అన్న ఎంతో కష్టపడి పనిచేశాడని, బిపిన్ రావత్ మన్ననలు పొందాడన్నారు. అందుకే తన వ్యక్తిగత భద్రతకు అన్నయ్యను నియమించుకున్నారని సాయితేజ సోదరుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. సాయితేజ సోదరుడు మహేశ్‌బాబు కూడా జవానే. ప్రస్తుతం మహేశ్ సిక్కింలో పనిచేస్తున్నారు.