దేశంలో ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ను అపాలంటే బూస్టర్ డోస్ కచ్చితం అనటం హాస్యాస్పదం అన్నారు డాక్టర్ యు.రఘురాం. అత్యధిక బూస్టర్ డోస్ వేసుకున్న ఇజ్రాయెల్ లో ఫోర్త్ వేవ్ నడుస్తూ భారీ కేసులు నమోదవుతున్నాయన్నారు. టెక్నికల్ గా కోవిషీల్డ్ లో అప్డేటెడ్ బూస్టర్ రాదన్నారు. వేసుకున్నా ఆ బూస్టర్ డోస్ పని చేస్తుందని నమ్మకం లేదన్నారు.
కోవాక్సిన్ లో సాధారణ ఫ్లూ వ్యాక్సిన్స్ లు, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ బూస్టర్ తీసుకోవచ్చు అన్నారు డా.రఘురాం. కేవలం కోవాక్సిన్ ఫ్లాట్ ఫామ్ లో మాత్రమే కొత్త స్టెయిన్స్ కు అనుగుణంగా వ్యాక్సిన్ ను అప్డేట్ చేసే అవకాశం ఉంటుందన్నారు. బూస్టర్ డోస్ మాత్రమే కాదు…ఇకపై ఎప్పటికప్పుడు అప్డేట్ తో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునే రోజులు వస్తాయన్నారు డాక్టర్ రఘురాం.