Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Cold War In Santanootalapadu Ysrcp Leaders

సంతనూతలపాడు వైసీపీలో లొల్లి?

Updated On - 07:25 PM, Wed - 5 January 22
By GSN Raju
సంతనూతలపాడు వైసీపీలో లొల్లి?

ఆయనది ఆ జిల్లా కాదు. కానీ.. ఎన్నికల సమయంలో పార్టీ ఆదేశాలతో మరో జిల్లాకు వెళ్లి.. పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో ఆయనకు జైకొట్టిన పార్టీ కేడరే ఇప్పుడు రివర్స్‌. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలకు గ్యాప్‌ వచ్చిందని టాక్‌. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా లొల్లి?

రెండున్నరేళ్ల తర్వాత సంతనూతలపాడు వైసీపీలో లుకలుకలు
టీజేఆర్ సుధాకర్‌బాబు. ప్రకాశంజిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు గత ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు అభ్యర్థిగా వైసీపీ నిర్ణయించటంతో ఇక్కడకు వచ్చి.. పోటీ చేసి వైసీపీ గాలిలో సునాయసంగా గెలిచారు. నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు ఆయన్ని పొరుగు వ్యక్తిగా చూడకుండా అక్కున చేర్చుకున్నారు కూడా. కొత్తలో ఎమ్మెల్యేకు.. కేడర్‌కు మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నా.. రెండున్నరేళ్ల తర్వాత లుకలుకలు బయటకు వస్తున్నాయి. అవి కొత్త రగడకు.. చర్చకు దారితీస్తున్నాయట.

మండల నేతకు.. ఎమ్మెల్యేకు మధ్య అభిప్రాయభేదాలు..!
ఆ మధ్య సొంత పనులపై హైదరాబాద్‌ వెళ్లిన ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అవసరం లేదంటూ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారట. ఈ అంశం అధికారపార్టీతోపాటు పోలీసు వర్గాల్లో చర్చగా మారింది. నాగులుప్పలపాడు మండలంలో ఆ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనస్తాపం చెంది ఎమ్మెల్యే ఆ నిర్ణయం తీసుకున్నారని లోకల్‌గా వినిపిస్తున్న టాక్‌. ఆ మండలంలోని ఒక కీలక నేతకు.. ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు మధ్య సమన్వయం కొరవడిందట. ఎంపీడీవో నియామకంపై బేధాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది.

వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపిన ఎమ్మెల్యే..?
నాగులుప్పలపాడు మండలానికి చెందిన ఆ నాయకుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. చీమకుర్తి నుంచి మరో కీలకవర్గం కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అధిష్ఠానాన్ని కలిసి ఫిర్యాదు చేసిందట. ఈ పరిణామాలపై అసంతృప్తి చెందిన సుధాకర్‌బాబు తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కి పంపారని చెబుతున్నారు.

వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి పంచాయతీ నుంచి జీతాలు?
నియోజకవర్గంలోని గ్రామ, మండలస్థాయి అధికారుల బదిలీలు, నియామకాల్లోనూ వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలతో సంబంధం లేకుండా తనకు ఇష్టం వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్న వ్యక్తిగత సహాయ సిబ్బందిలో ఐదుగురిని చీమకుర్తి నగర పంచాయతీ ఉద్యోగులుగా చూపించి జీతాలు తీసుకోవటం కూడా విమర్శలకు దారి తీస్తోందట. పంచాయతీ విధులకు హాజరుకాకుండా వారెలా జీతాలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారట. వారికి జీతాల కోసమే ఏటా ఏడు లక్షలు ఖర్చవుతున్నట్టు సమాచారం.

సొంత వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్న ఎమ్మెల్యే?
గతంలో కూడా అధికారుల బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై ఆరోపణలు వచ్చాయని గుర్తు చేస్తుంటారు ఆయన ప్రత్యర్థులు. పనిలోపనిగా ఎమ్మెల్యే కూడా సొంత వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారట. తనకు అనుకూలంగా ఉన్న నేతలకు పనులు చేసుకునేందుకు అవకాశాలు ఇస్తున్నట్టు వైరివర్గం మండిపడుతోంది. అలాగే వైసీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్న ద్వితీయ శ్రేణి నేతల కార్యకలాపాలపై సేకరించిన సమాచారాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్యే పంపారట. దీంతో సంతనూతలపాడు వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీలోని ఆయన ప్రత్యర్థివర్గంగా పరిస్థితి మారిందట.

పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత మంత్రి బాలినేనికి అప్పగింత
పరిస్థితి చేజారిపోకుండా సమస్యలను పరిష్కరించే బాధ్యతను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్ఠానం అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. సంతనూతలపాడు వైసీపీలో అసమ్మతిని చల్లార్చేందుకు మంత్రి బాలినేని ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తారు? పార్టీ కేడర్‌ ఎమ్మెల్యే వెంట నడుస్తుందా.. ఢీ అంటే ఢీ అని ఘర్షణ పడుతుందో చూడాలి.

  • Tags
  • ap politics
  • balineni
  • clash between own party
  • cm jagan
  • mla sudhakarbabu

RELATED ARTICLES

Dharmana Prasada Rao : : ఇంటి వద్దకే అన్ని సంక్షేమ పథకాలు..

Thammineni Seetharam : జగన్ అన్నమాటను నిలబెట్టుకున్నారు

Konaseema Clashes : కోనసీమలో మళ్లీ హై అలర్ట్‌

Chandrababu : పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చర్యంగా ఉంది

Atchannaidu : చర్యకు ప్రతిచర్య ఉంటుందని గుర్తు పెట్టుకోండి

తాజావార్తలు

  • Afghanistan: దయనీయ పరిస్థితిలో అఫ్గానిస్థాన్.. భారత్ నుంచి మానవతాసాయం

  • Naga Chaitanya: మొన్న సమంత.. నేడు శోభితా.. చైతూకు తప్పేలా లేదే..?

  • Bandi Sanjay: మోడీని అంబేద్కర్‌ వారసుడితో పోల్చిన బండి

  • Sairam Shankar : ‘వెయ్ దరువెయ్’ అంటున్నసాయిరామ్ శంకర్

  • Rakul Preet Singh : ఊపేస్తున్న రకుల్ డ్యాన్స్ వీడియో!

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions