AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిసింది. సచివాలయంలో దాదాపు 3 గంటలకు పైగా కేబినెట్ భేటీ కొనసాగగా.. ముఖ్యంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి మండలి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ సమావేశంలో 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB)లో చర్చించిన పలు పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడనున్నాయి.
Also Read
- CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
అదేవిధంగా, క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా మూడు సంస్థల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లే కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇక జోనల్ వ్యవస్థకు సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. రాష్ట్ర పరిపాలనలో సమతుల్యత కోసం తీసుకునే చర్యలపై అధికారులు వివరాలు సమర్పించారు. పలు పరిశ్రమలు, సంస్థలకు భూ కేటాయింపుల విషయంలో కూడా కేబినెట్ అనుమతులు ఇచ్చింది. మొత్తం 60కి పైగా ఎజెండా అంశాలను పరిశీలించిన కేబినెట్, వాటిలో ముఖ్యమైన వాటికి ఆమోదం తెలిపింది. మొత్తానికి, ఈ కేబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే పలు నిర్ణయాలతో ముగిసిందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!