జల జగడం.. కృష్ణజలాలపై సుప్రీంకు ఏపీ..!

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ ముదురుతోంది.. ఓ వైపు మాటల యుద్ధం.. మరోవైపు ప్రధానికి, కేంద్ర మంత్రులకు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు.. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది.. ఇప్పుడు కృష్ణజలాల వివాదంపై సుప్రీంకోర్టుకువెళ్లే యోచనలో ఉంది ఏపీ సర్కార్‌… సుప్రీంలో పిటిషన్‌ దాఖలుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంతర్‌రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్‌ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని, తక్షణమే తెలంగాణ జీవోను సస్పెండ్‌ చేయాలని, కేఆర్‌ఎంబీ విధివిధానాల ఖరారుకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని.. పిటిషన్‌లో పొందుపరుస్తున్నట్టు సమాచారం.

రైతుల, ప్రజల హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తోందని.. సముద్రంలోకి విలువైన జలాలను కలిసేలా పరిస్థితులు సృష్టించి మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని.. తక్షణం అడ్డుకోవాలంటూ ఈ వాదనలను పిటిషన్‌లో ప్రస్తావించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుండగా.. ఇక, విచారణ సందర్భంగా ప్రస్తావించనున్న అంశాలపై సాగునీటి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం… దేశంలో రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు సర్వసాధారణమై పోయాయి. అంతర్‌రాష్ట్ర నదులపై ఉన్న రిజర్వాయర్లను జాతీయ ఆస్తులుగా గుర్తించి, నిర్వహణ, భద్రతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని ఈసందర్భంగా విజ్ఞప్తిచేసే అవకాశం ఉందంటున్నారు.. రిజర్వాయర్లతోపాటు వాటిపై ఉన్న విద్యుత్‌ కేంద్రాలన్నింటినీకూడా జాతీయ ఆస్తులుగా గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఏపీ కోరనుందనని సమాచారం. వివిధ నదుల్లో నీటివాటాలపై వివిధ ట్రైబ్యునల్స్, కోర్టులు తమ తీర్పుల ద్వారా ఇప్పటికే ఖరారు చేశాయి.. వాటిని కచ్చితంగా అమలు చేయడానికి ఇది అవసరమంటున్న అధికారులు. నిర్దేశించిన వాటాలను మీరి నీటిని అక్రమంగా వాడుకోవడం, ఆ ఒప్పందాలను ఉల్లంఘించేలా కొత్త ప్రాజెక్టులు కట్టడం, లేదా ఉన్న ప్రాజెక్టులను విస్తరించడం తదితర అక్రమ చర్యలను ఆపాలంటే ఒక శాశ్వాత పరిష్కారం అవసరమని కోర్టుకు నివేదించనున్నట్టుగా సాగునీటి అధాకార వర్గాల సమాచారం. నదీజలాల వివాదం ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలోనే పొందుపరిచారని, రాజ్యాంగం ప్రకారం కేంద్రమే వీటిని పరిష్కరించాలని చెప్పారు కాబట్టి, అంతర్‌రాష్ట్ర నదీజలాలపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్‌ కేంద్రాలన్నీకూడా కేంద్రం పరిధిలోనే ఉండాలంటూ పిటిషన్‌ద్వారా ఏపీ కోరనున్నట్టు తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-