నకిలీ చలాన్ల స్కామ్‌.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

నకిలీ చనాల్ల స్కామ్‌ ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ప్రభుత్వ అధికారులు నకిలీ చలానాలతో కోట్ల రూపాయిలు అక్రమంగా కూడబెట్టారన్న వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణంపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు కూడా తీసుకున్నారు.. ఇప్పటికే కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు అధికారులు.. మరోవైపు.. నకిలీ చలాన్ల స్కామ్‌ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. డబ్బులు రికవరీ కాని ఆస్తులపై రిమార్కులు చూపెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయంటూ రికవరీ కాని ఆస్తులను ఎంకబెరెన్స్‌లో చూపెడుతోంది సర్కార్.. ఇక, ఇప్పటి వరకు 38 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ. 8 కోట్లకి పైగా నిధులు గోల్ మాల్ అయినట్టు అధికారులు గుర్తించారు.. అందులో.. సుమారు రూ. 5 కోట్ల మేర రికవరీ కూడా చేశారు.. 14 మంది సబ్ రిజిస్ట్రార్ల మీద చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-