రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్‌.. వారికి ఆర్థిక సహకారం

తుఫాన్‌ వల్ల పంట నష్టపోయిన రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తుఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించింది.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్‌ సైక్‌లోన్‌ వల్ల పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు పరిహారం అందించనున్నారు… సంబంధిత రైతుల ఖాతాల్లో 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సర్కార్.. రేపు రైతుల ఖాతాల్లో నేరుగా ఆ సొమ్మును జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్.. ఈ–క్రాప్‌ ఆధారంగా రైతులకు పంట నష్టపరిహారం పంపిణీని నమోదు చేశారు అధికారులు.. కాగా, వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు పంట నష్టపరిహారం కింద 13.96 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయంగా రూ. 1,071 కోట్లు అందించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

Related Articles

Latest Articles