ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 104 అంబులెన్స్..

కొత్త 104 అంబులెన్స్‌ వాహనాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 539… 104 అంబులెన్స్‌ వాహనాలను కొనుగోలు చేయనున్నారు.. రాష్ట్రంలోని ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ 104 అంబులెన్సు వాహనాన్ని కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. రూ. 89.27 కోట్లతో 104 అంబులెన్సు వాహనాలను కొనుగోలు చేయనున్నారు.. ఏడాదికి రూ. 75.82 కోట్ల మేర ఈ వాహనాలపై వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం… గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యామ్లీ విధానం అమలు చేసేందుకు ఈ వాహనాలు ఉపకరిస్తాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-