ఏపీలో స్థిరంగా కరోనా కేసులు…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 12,768 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,17,156 కు చేరింది. ఇందులో 15,62,229 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,43,795 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 98 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 11,132 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 15,612 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 98,048 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-