ఏపీ కరోనా అప్డేట్ : తగ్గిన కేసులు

ఏపీలో కర్ఫ్యూ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కర్ఫ్యూ కారణంగా ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 8110 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,87,883 కు చేరింది. ఇందులో 16,77 ,063 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 99057 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 67 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 11763 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 12,981 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 97,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-