ఏపీ కోవిడ్‌ అప్‌డేట్‌.. భారీగా పెరిగిన పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య మళ్లీ భారీగా పెరింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 67,911 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,608 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఆరుగురు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,107 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు..

దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,27,650కి చేరుకోగా.. రికవరీ కేసులు 19,98,561కు పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 13,970కు పెరిగితే.. ప్రస్తుతం రాష్ట్రంలో 15,119 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. రాష్ట్రంలో పరీక్షించిన శాంపిల్స్‌ సంఖ్య 2,72,29,781కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 281, నెల్లూరులో 261, తూర్పు గోదావరిలో 213 కేసులు వెలుగుచూశాయి.

Related Articles

Latest Articles

-Advertisement-