ఏపీలో భారీగా త‌గ్గిన కోవిడ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,08,616 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 6,952 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 58 మంది క‌రోనాతో మృతిచెంద‌గా.. నిన్న ఉద‌యం 9 గంట‌ల నుంచి ఇవాళ ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 11,577 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్ర‌కాశం జిల్లాలో 11 మంది, చిత్తూరులో 9, తూర్పు గోదావ‌రిలో ఆరుగురు, అనంత‌పూర్, కృష్ణా, విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఐదుగురు చొప్పున‌, శ్రీ‌కాకుళం, ప‌శ్చిమ గోదావ‌రిలో న‌లుగురు చొప్పున‌, క‌ర్నూలులో ముగ్గురు, గుంటూరు, విజ‌య‌న‌గ‌రంలో ఇద్ద‌రు చొప్పున‌, క‌డ‌ప‌, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క‌రు మృతిచెందారు.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో నిర్వ‌హించిన క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య 2,03,48,106కు చేరుకున్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్ర‌భుత్వం. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 18,00,179కు పెర‌గ‌గా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 91,417.. రిక‌వ‌రీ కేసులు 16,96,880కు పెర‌గ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 11,882 మంది క‌రోనాతో ప్రాణాలు వ‌దిలారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-