ఏపీ కరోనా అప్‌డేట్.. మళ్లీ భారీగా పెరిగిన కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 88,149 శాంపిల్స్‌ పరీక్షించగా.. 2,498 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 24 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు… తాజా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరులో ఇద్దరు చొప్పున, కృ ష్ణ, కర్నూలు, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు మృతిచెందారు. ఇక, గత 24 గంటల్లో 2,201 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 2,37,52,356కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసులతో కలుపుకుని.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,44,222కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 19,07,201కు పెరిగింది. ఇప్పటి వరకు 13,178 మంది కరోనా బాధితులు కన్నుమూస్తే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 23,843 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-