మెగా ఆఫర్ పెట్టేసిన యాంకర్ రష్మీ.. ఏకంగా చిరు సరసనే..?

బుల్లితెరపై అందాల విందు చేసే యాంకర్లల్లో రష్మీ పేరు గట్టిగానే వినిపిస్తోంటుంది.ఒకపక్క షోలలో మెరుస్తూనే మరోపక్క సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటుంది. ఇప్పటికే రష్మీ కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు మెగా ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో రష్మీ ఒక ఐటెం సాంగ్ చేయనుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా కనిపిస్తుండగా.. రష్మీ ఒక ప్రత్యేక గీతంలో చిరు పక్కన చిందు వేయనున్నదట.

చిరు సరసన డాన్స్ అంటే మాటలు కాదు.. అందులోను ఐటెం సాంగ్ అంటే మాస్ మసాలా, అందాల ఆరబోత ఉండనే ఉంటుంది. అందాల ఆరబోతకు రష్మీ తగ్గేదేలే అంటున్న విషయం తెల్సిందే. అందుకే మెగా కాంపౌడ్ లోకి రష్మిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక జబర్దస్త్ బ్యూటీ అనసూయ కూడా ఇలాగే స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ మంచి పేరు తెచ్చకుంది. ఇక సీనియర్ బాటలోనే జూనియర్ రష్మీ కూడా నడుస్తుంది అన్న మాట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles