‘మా’ ఎన్నికల ఫలితాలపై అనసూయ సంచలన ట్వీట్ !

”మా” అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తాజాగా జబర్దస్త్‌ కామెడీ షో యాంకర్‌, ప్రముఖ నటీ అనసూయ ఆసక్తి కర ట్వీట్‌ చేసింది. నిన్న రాత్రి తాను భారీ మెజారిటీ తో గెలిచానని చెప్పారని… కానీ ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో మాత్రం తాను ఓడిపోయానని ప్రకటించారు. అసలు రాత్రికి రాత్రే ఫలితాల్లో ఇంతలా మార్పు జరిగిందా ? అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది. ఎన్నికల నిబంధనలను విరుద్ధంగా బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ ఎటకారంగా వ్యాఖ్యానించింది యాంకర్‌ అనసూయ. కాగా నిన్న జరిగిన మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి యాంకర్‌ అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందంటూ..నిన్న రాత్ర అన్ని వార్త చానెళ్లో వార్తలు వచ్చాయి. అయితే.. ఇవాళ తాజాగా ఎన్నికల అధికారులు ప్రకటించిన… లిస్ట్‌ లో మాత్రం… అనసూయ ఓటమి పాలైనట్లు ఉంది. దీంతో ఏం చేయాలో తోచక… తన సోషల్‌ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది యాంకర్‌ అనసూయ.

-Advertisement-'మా' ఎన్నికల ఫలితాలపై అనసూయ సంచలన ట్వీట్ !

Related Articles

Latest Articles