తమన్నాను అనసూయ రీప్లేస్ చేస్తుందా ?!

మిల్కీ బ్యూటీ తమన్నా ప్లేస్ అనసూయ రీప్లేస్ చేయనుందట. స్టార్ హీరోయిన్ ప్లేస్ ను ఆమె ఎలా భర్తీ చేస్తుంది ? అంటే… తమన్నా సినిమాలు, ఎండార్స్‌మెంట్‌లు, వెబ్ సిరీస్‌లు మరియు టీవీ షోలతో చాలా బిజీగా ఉంది. ఇటీవలే ఆమె ఓ ఆమె జెమిని టీవీలో ప్రసారమవుతున్న ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ తెలుగు వెర్షన్ కోసం హోస్ట్ గా మారింది. ఏ షో ప్రారంభ వారాంతంలో చాలా తక్కువ టీఆర్పీలను అందుకుంది. అయితే నెమ్మదిగా తాజాగా ప్రసరమైన వారాలలో ఇది పుంజుకుంది. తమన్నా హోస్టింగ్ నైపుణ్యాలపై ప్రశంసలు కురిశాయి. కానీ ఈ కార్యక్రమం తగినంత బజ్ ను రాబట్టుకోలేకపోయింది. ప్రేక్షకుల దృష్టిని ఈ షో వైపు మరల్చడంతో తమన్నా విజయ్ సాధించలేదని చెప్పొచ్చు. మేకర్స్ కూడా ఆమె ఇచ్చిన డేట్స్ ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. దీంతో తమన్నా ఈ షోను వదిలేసి తన తదుపరి ప్రాజెక్ట్‌ షూటింగ్ ను ప్రారంభించారు.

Read Also : నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు !

ఈ నేపథ్యంలో ఇప్పుడు తమన్నా స్థానంలో అనసూయ భరద్వాజ్‌ని తీసుకున్నారు. అనసూయ ఇటీవలే బెంగుళూరులో పెండింగ్‌లో ఉన్న ఎపిసోడ్‌ల షూటింగ్ ప్రారంభించింది. అయితే షో కోసం అనసూయ భారీగా ఛార్జ్ చేస్తోంది. తమన్నా తిరిగి కార్యక్రమానికి తిరిగి వస్తుందా ? లేదా? అనసూయ సీజన్ పూర్తి చేస్తుందా ? అనే అనుమానాలపై క్లారిటీ లేదు. తమన్నా వెంకటేష్, వరుణ్ తేజ్ స్టారర్ “ఎఫ్3” కోసం బల్క్ డేట్స్ కేటాయించింది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో షూటింగ్ జరుగుతోంది. అనసూయ అనేక టీవీ షోలకు హోస్ట్ చేస్తోంది. మరోవైపు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.

-Advertisement-తమన్నాను అనసూయ రీప్లేస్ చేస్తుందా ?!

Related Articles

Latest Articles