ఇద్దరు బాయ్స్, ఒక గాళ్… లేడీ డైరెక్టర్ నెక్ట్స్ మూవీ!

‘గల్లీ బాయ్’ సినిమాతో తన డిఫరెంట్ టేస్ట్ ను మరోసారి ప్రూవ్ చేసుకుంది జోయా అఖ్తర్. వెటరన్ బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ కూతురుగా మెగాఫోన్ పట్టుకున్న మిస్ జోయా క్రమంగా తన సత్తా చాటుతూ వస్తోంది. ‘జిందగీ నా మిలేగి దుబారా, దిల్ ధడక్ నే దో’ లాంటి చిత్రాలతో యూత్ ను తెగ ఆకట్టుకోగలిగింది. ఆమె తాజాగా మరో సినిమాకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి కంప్లీట్ యూత్ ఫుల్ కాంబినేషన్ కు తెర తీసింది… ‘గల్లీ బాయ్’లో మంచి పాత్రలో కనిపించాడు సిద్ధాంత్ చతుర్వేది. ఈ యంగ్ యాక్టర్ మరోసారి జోయా అఖ్తర్ మూవీలో రిపీట్ కానున్నాడు. ఇక సిద్ధాంత్ తో పాటూ ‘ద వైట్ టైగర్’ మూవీతో ఫేమస్ అయిన ఆదర్శ్ గౌరవ్ కూడా టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ మూవీలో నటించనున్నాడట.

అయితే, వీరిద్దరి మధ్యనా అందాల భామ అనన్య పాండే కూడా మెరిసిపోనుంది సినిమాలో. జోయా అఖ్తర్ నెక్ట్స్ వెంచర్ లో అనన్య హీరోయిన్ అని కొన్నాళ్ల క్రితమే న్యూస్ వచ్చింది. అయితే, ఇప్పుడు ఆమెతో పాటూ ఇద్దరు హీరోల పేర్లు కూడా సొషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, ఆదర్శ్ గౌరవ్ కాంబినేషన్ లో జోయా తెరకెక్కించే చిత్రం ఈ సంవత్సరం చివరికల్లా సెట్స్ మీదకు చేరుతుందని సమాచారం. కరోనా డిస్టబెన్స్ ఏమీ లేకుంటే ఈ యూత్ ఫుల్ మూవీ వచ్చే సంవత్సరం థియేటర్స్ కి చేరుకోవచ్చు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-