‘లైగర్’ బ్యూటీ అనన్య తండ్రి చంకీ పాండే, విజయ్ గురించి ఏమన్నాడంటే…

సాధారణంగా తనతో నటించిన హీరో గురించి హీరోయిన్ చెబుతుంటుంది. ఆహా, ఓహో అంటూ పొగిడేస్తుంది కూడా! అది ఎలాగూ తప్పదు మరి! కానీ, మీరెప్పుడైనా ఓ యంగ్ హీరో గురించి అతడితో నటించిన బ్యూటిఫుల్ హీరోయిన్ తండ్రి మాట్లాడటం విన్నారా? చంకీ పాండే అదే చేశాడు! కూతురు అనన్యతో నటించిన మన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండని అమాంతం ఆకాశానికి ఎత్తేశాడు!
విజయ్ దేవరకొండ సరసన బీ-టౌన్ క్యూటీ అనన్య పాండే ‘లైగర్’లో నటిస్తోంది. వారిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ, ఇంకా ఫస్ట్ కాపీ రాక ముందే ‘లైగర్’ సూపర్బ్ అంటున్నాడు చంకీ పాండే. హీరోయిన్ అనన్యకి తండ్రి అయిన ఈ బాలీవుడ్ సీనియర్ యాక్టర్ పూరీ జగన్నాథ్ ప్యాన్ ఇండియా ఎంటర్టైనర్ రషెస్ చూశాడట. ‘లైగర్’ అప్పుడే ఆయనకు తెగ నచ్చేసిందట. సినిమా కంటే ఎక్కువగా మన వీడి మెస్మరైజ్ చేశాడట. “డ్యాన్స్, యాక్షన్, ఎవ్రీథింగ్ ఇరగశాడు! విజయ్ దేవరకొండ ఆల్ రౌండర్” అంటున్నాడు చంకీ! అక్కడితో ఆగలేదు… “లైగర్ హిట్ అవ్వటం పక్కా! విజయ్ దేవరకొండ, అనన్య జోడీ కూడా అద్భుతం” అనేశాడు!
ఇక చంకీ పాండే మరో ప్రశ్నకు బదులిస్తూ, సేమ్ ఇంటర్వ్యూలో… సోదరుడి కుమార్తె గురించి కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అనన్య కజిన్ అలన్నా పాండే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోవటం లేదని తేల్చేశాడు. ఆమె అమెరికాలో మోడలింగ్ చేస్తోంది. అదే కంటిన్యూ చేయనుంది అని వివరించాడు. గత కొంత కాలంగా అలన్నా పాండే బాలీవుడ్ లో కాలుమోపుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అనన్య పాండే ఇప్పటికే ‘నెపోటిజమ్’ సెగ తీవ్రంగా ఎదుర్కుంటూ ఉండటంతో మరో పాండే గాళ్ ని రంగంలోకి తీసుకు వస్తారా అని అందరూ అనుమానించారు. అటువంటి రిస్క్ చేయబోవటం లేదని చంకీ చెప్పకనే చెప్పినట్లు అయింది!

Related Articles

Latest Articles

-Advertisement-