గతంలోకి తీసుకెళ్తా… “వకీల్ సాబ్” బ్యూటీ పిక్స్

“వకీల్ సాబ్” బ్యూటీ అనన్య నాగళ్ళ గతంలోకి తీసుకెళ్తాను అంటూ తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆమె చీరకట్టులో బొద్దుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మిమల్ని 2019కి తీసుకెళ్తున్నాను. బొద్దుగా అమాయకంగా ఉన్న సమయంలో…” అంటూ రాసుకొచ్చింది.

అనన్య నాగళ్ళ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న ప్రతిభావంతులలో ఒకరు. “మల్లేశం” సినిమాతో అరంగేట్రం చేసిన ఈ తెలుగు అమ్మాయి పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్‌”తో క్రేజ్ ని సంపాదించుకుంది.

Read Also : పుకార్లకు చెక్… ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్

“వకీల్ సాబ్” విడుదల తర్వాత మంచి అవకాశాలు వస్తాయని పెద్ద ఆశలే పెట్టుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఆమె “వకీల్ సాబ్‌”ని ప్రమోట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుండి క్రమం తప్పకుండా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లను అప్‌డేట్ చేస్తోంది. ఈ యంగ్ బ్యూటీ తన ఫోటోలను వరుసగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఆమె ఎప్పటికప్పుడు తన అప్‌డేట్‌లు, వర్కవుట్ ఫోటోలను, ఫోటోషూట్‌ల నుండి కొత్త స్టిల్స్ పోస్ట్ చేస్తుంది. ఇటీవల కాలంలో వర్కౌట్లు చేసి సన్నబడిన మన తెలుగమ్మాయి గ్లామర్ ను ఒలికించడానికి ఏమాత్రం జంకడం లేదు. మరి ఈ బ్యూటీని మరిన్ని ఆఫర్లు పలకరిస్తాయేమో చూడాలి.

Image
ImageImage
Image

Related Articles

Latest Articles

-Advertisement-