ఆనందయ్య మందు పంపిణీపై నేడు హైకోర్టులో విచారణ

ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐ డ్రాప్స్ మినహా మిగతా వాటికి అనుమతిని ఇచ్చింది. కాగా, నేడు ఐ డ్రాప్స్ పంపిణీపై విచారణ జరపనుంది హైకోర్టు. మొత్తం 4 పిటిషన్లపై విచారణ చేయనుంది. ఇక ప్రభుత్వం ఇప్పటికే ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్దారించారు. కంటిలో వేసే మందు మినహా మిగిలిన మందులు రోగులకు అందివచ్చని షరతు పెట్టారు, దీంతో వాటి తయారీకి ఆయన సిద్ధం అవుతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఆనందయ్య మందు అందుబాటులోకి రానున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-