ఆయుర్వేద మందుపై రచ్చ..సోమిరెడ్డిపై ఆనందయ్య విమర్శలు…

మందు పంపిణీపై ఎట్టకేలకు ఆనందయ్య స్పందించారు. కొంత ఇబ్బంది ఉన్న మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని..మొదట నియోజకవర్గంలో ఇచ్చి తర్వాత ఇతర ప్రాంతాలకు ఇద్దామని ఎమ్మెల్యేతో తానే చెప్పానని పేర్కొన్నారు. పంపిణీపై సోమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని..సోమిరెడ్డి మాట్లాడింది అవాస్తవమని విమర్శలు చేశారు. మీ సొంత గొడవలోకి తనను లాగవద్దన్నారు. తనను ప్రజాసేవ కోసం ఉపయోగించుకోవాలని..రాజకీయాల్లోకి లాగొద్దని మండిపడ్డారు. సోమవారం నుంచి ముందు పంపిణీ జరుగుతుందని… ఏవైనా పెద్ద ఆటంకాలు వస్తే తప్ప.. పంపిణీ ఆగదని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా అనందయ్య మందు పంపిణికి ఎటువంటి ఇబ్బంది లేదని నెల్లూరు ఇన్ చార్జ్ కలెక్టర్ హారింద్రప్రసాద్ పేర్కొన్నారు. కోర్టు, ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది..మేము ప్రత్యేకంగా ఇచ్చేది అంటూ ఎమీ లేదన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పెంచుతామని హామీ ఇచ్చారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-