పుల్ల ఇడ్లీపై ఆనంద్ మ‌హీంద్ర ట్వీట్‌… వైర‌ల్‌…

దేశంలో ఎక్క‌డ ఎలాంటి వినూత్నమైన విష‌యాలు జ‌రిగినా వాటి గురించి ట్వ‌ట్ట‌ర్‌లో ప్ర‌స్తావించే వ్య‌క్తి ఆనంద్ మ‌హీంద్ర‌.  వ్యాపార‌రంగంలో బిజీగా ఉంటూనే, మ‌రోవైపు ట్విట్ట‌ర్‌లోయాక్టీవ్ గా క‌నిపిస్తుంటారు ఆనంద్ మ‌హీంద్రా.  తాజాగా, ఆయ‌న పుల్ల ఇడ్లీ గురించి ట్వీట్ చేశారు.  బెంగ‌ళూరులోని ఓ అల్పాహార సెంట‌ర్ పుల్ల ఇడ్లీని త‌యారు చేసింద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు పుల్ల ఐస్‌క్రీమ్ ను చూశామ‌ని, ఇప్పుడు పుల్ల ఇడ్లీని చూస్తున్నామ‌ని ట్వీట్ చేశారు.  వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు బెంగ‌ళూరు రాజ‌ధానిగా మారింద‌ని ఆనంద్ మ‌హీంద్ర ట్వీట్ చేశారు.  ఆనంద్ మ‌హీంద్ర చేసిన ట్వీట్‌పై నెటిజన్లు అంతే వేగంగా స్పందించారు. చేతులు క‌డుక్కొవాల్సిన అవ‌స‌రం లేద‌ని, దీని వ‌ల‌న నీరు ఆదా అవుతుంద‌ని కొంత‌మంది నెటిజ‌న్లు ట్వీట్ చేశారు.  ప్ర‌స్తుతం ఆనంద్ మ‌హీంద్రా పుల్ల ఇడ్లీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.  

Read: పంజాబ్ సంక్షోభం ఎవ‌రికి క‌లిసి వ‌స్తుంది?

-Advertisement-పుల్ల ఇడ్లీపై ఆనంద్ మ‌హీంద్ర ట్వీట్‌... వైర‌ల్‌...

Related Articles

Latest Articles