వైర‌ల్‌: ఆనంద్ మ‌హీంద్రా బ్యాక్ బెంచ్ క‌థ‌…

వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నా, నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వారిలో ఒక‌రు ఆనంద్ మ‌హీంద్రా.  కొత్త కొత్త విష‌యాల‌ను నెటిజ‌న్ల‌తో పంచుకుంటూ ఉంటారు.  ఇక జాతీయ యువ‌జ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా  ఆనంద్ మ‌హీంద్రా ఓ ఫొటోను షేర్ చేశాడు.  క్లాస్‌రూమ్‌లో బ్యాక్ బెంచ్‌లో కూర్చొని దిగిన ఫొటోను షేర్ చేశాడు.  దీనిపై నెటిజ‌న్లు ఆడిగిన ప్ర‌శ్న‌ల‌కు వెరైటీగా ఆనంద్ మ‌హీంద్రా స‌మాధానం ఇచ్చారు.  త‌న‌కు ఎన‌ర్జీ లెవ‌ల్స్ త‌గ్గిన‌పుడు క్లాస్‌రూమ్‌కు వ‌చ్చి బ్యాక్‌బెంచ్‌లో కూర్చుంటాన‌ని, అలా కూర్చుంటే చాలా రిలీఫ్ వ‌స్తుంద‌ని అంటూ ట్వీట్ చేశారు.  బ్యాక్‌బెంచ్‌లో కూర్చుంటే క్లాస్ రూమంతా చూసే అవ‌కాశం దొరుకుతుంద‌ని, అలాగే ప్ర‌పంచాన్ని కూడా చూడొచ్చ‌ని అన్నారు.  త‌న‌కు హిస్ట‌రీ స‌బ్జెక్ట్ అంటే ఇష్ట‌మ‌ని ఆనంద్ మ‌హీంద్రా త‌న మ‌న‌సులోని భావాల‌ను నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు.  

Read: చైతన్య చిలిపి చేష్టలు.. దక్ష కొంటె నవ్వులు..’ఎంత సక్కగుందిరో’..

Related Articles

Latest Articles