ఆనంద్ దేవ‌ర‌కొండ ‘హైవే’ షూటింగ్ పూర్తి!

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ మూవీ ‘హైవే’. ఇందులో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ‘చుట్టాలబ్బాయి’ చిత్రంతో నిర్మాతగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వెంకట్‌ తలారి, శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘క్యాచీ టైటిల్‌తో పాటు డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయని, వాటికి తగ్గట్టుగా మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెలంగాణ‌, ఆంధ్రప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపామని, ఇటీవలే షూటింగ్ పూర్త‌య్యింద’ని నిర్మాత తెలిపారు. ‘ ‘118’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన గుహ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించడం ఆనందంగా ఉందని, సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి పాజిటివ్ వైబ్స్ నెల‌కొని ఉన్నాయని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ’ని నిర్మాత చెప్పారు. దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ, ”హైవే నేపథ్యంలో సాగే సైకో క్రై మ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ప్ర‌తిక్ష‌ణం ట్విస్టులు, ట‌ర్నుల‌తో కథ ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. త్వ‌ర‌లో కొన్ని క్రేజీ అప్‌డేట్స్‌తో మీ ముందుకు వ‌స్తాం” అని అన్నారు. ఈ చిత్రానికి సైమన్ కె కింగ్ సంగీతం అందిస్తున్నారు.

-Advertisement-ఆనంద్ దేవ‌ర‌కొండ 'హైవే' షూటింగ్ పూర్తి!

Related Articles

Latest Articles