‘కేన్స్’లో మెరిసిన రోబో బ్యూటీ !

హీరోయిన్, బ్రిటీష్ మోడల్ అమీ జాక్సన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021 రెడ్ కార్పెట్‌ పై మెరిసింది. ఈ వేడుకలో ఆమె రెడ్ కలర్ గౌను ధరించి అద్భుతంగా కన్పించింది. అందులో యువరాణిలా కన్పిస్తున్న ఆమె కేన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆఫ్-షోల్డర్ గౌను, దాని చుట్టూ ఫ్లాప్ తో డిజైన్ చేశారు. ఈ దుస్తులను దుబాయ్ కేంద్రంగా ఉన్న ఫ్యాషన్ హౌస్ అటెలియర్ జుహ్రా రూపొందించారు. అమీ భారీ డైమండ్ నెక్లెస్, చెవిరింగులతో ఆ డ్రెస్ ఇంకా అందంగా కన్పించింది.

Read Also : “విక్రమ్” షూటింగ్ స్టార్ట్ చేసిన కమల్ హాసన్

పైగా ఆమె లిప్ స్టిక్ కూడా డ్రెస్ కలర్ దే వేసుకుంది. సింపుల్ పోనీ టెయిల్ హెయిర్ స్టైల్ తో లుక్ ను కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ది స్టోరీ ఆఫ్ మై వైఫ్’ చిత్రం ప్రదర్శన సందర్భంగా ఆమె కేన్స్‌లో కనిపించింది. ఆమె ఇటీవలే ఒక బిడ్డకు తల్లైన విషయం తెలిసిందే. చివరిసారిగా అమీ ”రోబో 2.0″లో కన్పించింది. కాగా కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, సోనమ్ కపూర్ అహుజా, మల్లికా షెరావత్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా జోనాస్, కంగనా రనౌత్ వంటి పలువురు బి-టౌన్ నటీమణులు పాల్గొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-