అగ్గిరాజేసిన ‘నల్లమల’ టీజర్

‘ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే అందంతో బంధిం చావే..’ అనే ఒక్కపాటతో ఒక్కసారిగా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్రం ‘నల్లమల’.. అమిత్ తీవారి, భాను శ్రీ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రవి చరణ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను దర్శకుడు దేవకట్టా చేతుల మీదుగా విడుదల చేయించారు. నల్లమల అడవి బ్యాక్ డ్రాప్ లో వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఆకట్టుకొంది. లవ్ అండ్ ఎమోషన్‌తో కూడా ఈ సినిమా సాగనుందని దర్శకుడు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

గతంలో ఎన్నో సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్లు చేసి మెప్పించిన అమిత్, నల్లమల హీరోగా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. నాజర్, తనికెళ్ళ భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, షవర్ అలీ, ఛత్రపతి శేఖర్, కాశీ విశ్వనాథ్, చలాకి చంటి, ముక్కు అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

-Advertisement-అగ్గిరాజేసిన ‘నల్లమల’ టీజర్

Related Articles

Latest Articles