బిగ్ బి ’52 నాట్ ఔట్!’…

సినిమా ఇండస్ట్రీ అంటే కళలు, కలలు మాత్రమే కాదు… కాంపిటీషన్ కూడా! నిజానికి గ్లామర్ ప్రపంచంలో అందరికంటే, అన్నిటికంటే ఉధృతమైనది పోటీనే! ఆ పోటీకి తట్టుకోలేకే చాలా మంది కొట్టుకుపోతుంటారు. అయిదేళ్లో, పదేళ్లో లైమ్ లైట్ లో నిలిస్తే అదే గొప్ప! ఇక పదేళ్ల తరువాత ఎన్ని ఎక్కువ సంవత్సరాలు సత్తా చాటితే అంతగా లెజెండ్స్ అయిపోతుంటారు సినిమా సెలబ్రిటీలు! మరి ఒక వ్యక్తి ఏకంగా 52 ఏళ్లు… అంటే, అర్థ శతాబ్దానికంటే ఎక్కువగా… దేశం మొత్తాన్ని మాయ చేస్తే? ఆ అద్భుతాన్నే… అమితాబ్ బచ్చన్ అంటారు! బిగ్ బి అమితాబ్ బాలీవుడ్ జర్నీ స్టార్ట్ చేసి 52 ఏళ్లు పూర్తైంది! ఈ సందర్భంగా ఆయన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేశారు. అందులో ‘జంజీర్’ మొదలు ‘గులాబో సితాబో’ దాకా బీ-టౌన్ మెగాస్టార్ డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. అయిదు దశాబ్దాల కాలం ఇట్టే గడిచిపోయింది అంటూ ఆయన కామెంట్ చేశారు.

కానీ, తన సుదీర్ఘ ప్రయాణం తనకే ఆశ్చర్యం కలిగిస్తోంది అంటూ ఆనందం కూడా వ్యక్తం చేశారు. అమితాబ్ పోస్ట్ కు బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఉత్సాహంగా స్పందించారు. శిల్పా శెట్టి అయితే ‘మీ లాంటి వారు మరెవరూ లేరు. ఇక ముందు ఉండరు కూడా’ అంటూ తన అభిమానం చాటుకుంది.అమితాబ్ తో పాటూ బాలీవుడ్ లో ప్రయాణం మొదలు పెట్టిన నటీనటులంతా దాదాపుగా రిటైర్మెంట్ ప్రకటించేశారు. కాదంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. కానీ, బచ్చన్ ది గ్రేట్… ఇంకా సూపర్ బిజీగా ఉన్నారు. దీపికా పదుకొణే లాంటి ఈ తరం స్టార్ తో, హాలీవుడ్ ఫిల్మ్ ‘ద ఇంటర్న్’… హిందీ రీమేక్ లో నటించబోతున్నాడు. సౌత్ బ్యూటీ రశ్మిక లాంటి సూపర్ జూనియర్ తో ‘గుడ్ బై’ అనే సినిమా చేస్తున్నాడు. అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ తో ‘మేడే’ మూవీలో నటిస్తున్నాడు! అందుకే అమితాబ్ ’52 నాట్ ఔట్!’ అంటూ ఆయన అభిమానులు ఉప్పొంగిపోతున్నారు…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-