అమిత్ షా హుజురాబాద్ ప్రచారానికి మూడుసార్లు వస్తారు!

హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మూడు సార్లు వస్తారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. త్వరలోనే అమిత్ షా పర్యటనకు సంబందించిన షెడ్యూలు చెబుతామన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘హుజురాబాద్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేసే అవకాశం ఉంది.. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని సీఎం ఢిల్లీ వెళ్లాడు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయి. నిర్మల్ అమిత్ షా సభకి మూడు లక్షలు వచ్చేలా శ్రేణులు పని చేయాలని పిలునిచ్చారు. కేంద్ర నాయకత్వం పూర్తి సహాయం అందిస్తుంది. హుజురాబాద్ గెలుపు పార్టీకి అవసరం.. ఎంఐఎం గుండాలు బైంసాలో విధ్యంసం సృష్టించారు. ముఖ్యమంత్రి మొండి వైఖరితో, ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తుందని సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించడం లేదు.. 2023 ఎన్నికలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని’ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-