ఏపీ బీజేపీ నేతలకు అమిత్‌షా క్లాస్..

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు రాష్ట్ర బీజేపీ నేతలు.. అయితే, ఈ సమావేశంలో ఏపీ నేతలకు అమిత్‌షా పెద్ద క్లాసే తీసుకున్నారట.. ఏపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్‌కి ప్రత్యేకంగా ఆయన క్లాస్‌ పీకినట్టు సమాచారం.. వైసీపీయే మన ప్రధాన శత్రువు… ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించిన ఆయన.. అమరావతే ఏపీ రాజధాని అన్నది బీజేపీ స్టాండ్‌.. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలపాలని సూచించారు.. జనసేనా మన మిత్రపక్షం… కలసి ముందుకు సాగండి అనిసూచించిన ఆయన.. సుజనా చౌదరి, సీఎం రమేష్.. ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని తెలిపారట.. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారం చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు షా చెప్పినట్టుగా తెలుస్తోంది.

Read Also: విశాఖ టు మధ్యప్రదేశ్‌.. అమెజాన్‌ ద్వారా గంజాయి..!

మరోవైపు పొత్తులపై కూడా అమిత్‌షా క్లారిటీ ఇచ్చారు.. ప్రస్తుతం అధికార వైసీపీతో రాజకీయంగా రాష్ట్రంలో దూరం పాటిస్తున్న బీజేపీ… ఇదే సమయంలో టీడీపీ విషయంలోనూ సమానదూరం పాటించాలని తనను కలిసిన బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు చెప్పేశారు. దీంతో బీజేపీతో మళ్లీ కలిసేందుకు టీడీపీ తాజాగా చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్‌లు పడినట్టు అయిపోయింది.. ఇక, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే విషయంలోనూ బీజేపీ నేతలకు అమిత్ షా పలు సూచనలు చేశారట.. జనసేనతో కలిసి ఈ ఎన్నికలు ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించాలని ఆదేశాలు జారీ చేశారట అమిత్‌షా.

Related Articles

Latest Articles