పాక్‌పై మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌…షా క్లారిటీ…

పాక్ ప్రేరిప‌త ఉగ్ర‌వాదులు జ‌మ్ముకాశ్మీర్‌లో మ‌ళ్లీ రెచ్చిపోతున్నారు.  గ‌త కొన్ని రోజులుగా ఉగ్ర‌వాదులు జ‌మ్ముకాశ్మీర్‌లో సాధార‌ణ పౌరుల‌ను టార్గెట్ చేసుకొని విధ్వంసాల‌కు పాల్ప‌డుతున్నారు.  పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల తీరుపై, పాక్ వైఖ‌రిపై భార‌త ప్ర‌భుత్వం మండిప‌డుతున్న‌ది.  పాక్ ప్ర‌వ‌ర్త‌న, తీరు మార్చుకోకుంటే మ‌రోసారి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వ‌నే దిశ‌గా హెచ్చ‌రిక‌లు చేసింది.  కశ్మీరీలను పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు హత్య చేయడం వెంటనే ఆపాలి. అతిక్రమణలనూ మానుకోవాలి. దాడులను మన దేశం సహించేది లేదని, స‌రిహ‌ద్దుల‌ను అస్థిర‌త ప‌ర‌చాల‌ని చూస్తే స‌హించేది లేద‌ని, గ‌ట్టిగా జ‌వాబు ఇస్తామ‌ని అమిత్ షా గోవాలో పేర్కొన్నారు.  పాక్ పోక‌డ మార‌క‌పోతే మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వ‌ని అమిత్ షా పేర్కొన్నారు.  

Read: నేటితో ముగియ‌నున్న శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు…

-Advertisement-పాక్‌పై మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌...షా క్లారిటీ...

Related Articles

Latest Articles