ఏపీ ప్రభుత్వానికి అమెరికా తెలుగు అసోసియేషన్ భారీ విరాళం

కోవిడ్ వైద్యంలో కీలకమైన ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ ను ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించింది అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా). సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు ఆటా ప్రతినిధులు. ప్రాథమికంగా 50 కాన్సట్రేటర్స్ ను ప్రభుత్వానికి అందించిన ఆటా.. మొత్తం 600 కాన్సట్రేటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనుంది. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని..ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటా సాయంగా నిలిచిందన్నారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా 600 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారని.. 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా పంపారని కొనియాడారు. ప్రస్తుతం 50 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారని..ఈ సాయం అందించినందుకు ఆటా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. అనంతరం ఏపీ ఆటా ప్రతినిధి శివ భరత్ రెడ్డి మాట్లాడుతూ మేమంతా కలిసి తెలుగు ప్రజలకు సాయం చేయాలని నిర్ణయించామని..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో చేస్తున్నారన్నారు. ఆయనకు మద్దతుగా మేము కూడా సాయం చేస్తున్నామని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-