నిన్న గూగుల్‌..నేడు అమెజాన్‌…క‌న్న‌డిగుల ఆగ్ర‌హం…

దేశంలో అగ్లీ భాష ఏంటి అని గూగుల్‌ని అడిగితే క‌న్న‌డ అని స‌మాధానం రావ‌డంతో క‌న్న‌డిగులు తీవ్రస్థాయిలో విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే.  కన్న‌డ భాషకు ప్రాచీన భాష‌గా గుర్తింపు ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో గూగుల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.  ఈ సంగ‌ట‌న మ‌రువ‌క ముందే క‌ర్ణాట‌క జెండా రంగుల చిహ్నాల‌తో అమెజాన్ బికినీని విక్రియించింది.  దీంతో మ‌రోసారి క‌న్న‌డిగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  అంత‌ర్జాతీయ సంస్థ‌లు క‌ర్ణాట‌క‌ను అవ‌మానిస్తున్నాయ‌ని నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  ఇలాంటివి పున‌రావృతం కాకుండా మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీల‌పై చర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి అర‌వింద్ లింబావాలి పేర్కోన్నారు.  వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుంటే న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-