అంత‌రిక్ష‌యాత్ర‌కు సిద్ధ‌మైన జెఫ్ బెజోస్‌…

అంత‌రిక్ష యాత్ర‌కు అమెజాన్ అధిప‌తి జెఫ్ బెజోస్ సిద్ధం అవుతున్నారు.  భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈరోజు సాయంత్రం 6:30 గంట‌ల‌కు జెఫ్ బెజోస్ ఆయ‌న త‌మ్ముడు, మ‌రో న‌లుగురితో క‌లిసి అంత‌రిక్ష‌యానం చేయ‌బోతున్నారు. త‌న అంత‌రిక్ష సంస్థ బ్లూఆరిజిన్ త‌యారు చేసిన న్యూషెప‌ర్డ్ స్పేస్ ష‌టిల్ ద్వారా ఈ బృందం అంత‌రిక్షంలోకి వెళ్ల‌బోతున్నారు.  భూమి నుంచి 100 కిలోమీట‌ర్ల ఎత్తుకు వెళ్లి క‌ర్మ‌న్ రేఖ‌ను దాటి అక్క‌డి నుంచి తిరిగి భూమికి చేరుకుంటారు.  ఈ న్యూషెప‌ర్డ్ లో జెఫ్ బెజోస్‌, ఆయ‌న సోద‌రుడు మార్క్‌, 82 ఏళ్ల మాజీ మ‌హిళా ఫైల‌ట్ వాలీఫంక్‌, 18 ఏళ్ల అలివ‌ర్ డేమెన్ లు రోద‌సియాత్ర చేయ‌బోతున్నారు.

Read: వ‌చ్చేవారం నుంచి కోవాగ్జిన్ సెకండ్ డోస్ ట్ర‌య‌ల్స్‌…

 కొన్ని రోజుల క్రింద‌ట వ‌ర్జిన్ గెలాక్టిక్ స్పేస్ యాత్ర‌ను చేసిన సంగ‌తి తెలిసిందే.  న్యూషెప‌ర్డ్ స్పెస్ ష‌టిల్ పూర్తిగా ఆటోమెటిక్‌గా ప‌నిచేస్తుంది.  దీని మోత్తం కంట్రోల్ భూమిమీద నుంచే ఉంటుంది.  పైలెట్లు లేకుండా జ‌రుగుతున్న యాత్ర కావ‌డంతో అందరిదృష్టి ఈ యాత్ర‌పైనే ఉన్న‌ది.  ప‌శ్చిమ టెక్సాస్ ఎడారి నుంచి ఈ రాకెట్ అంత‌రిక్షంలోకి దూసుకుపోనున్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-