అమ‌రీంద‌ర్ సింగ్ సంచల‌న వ్యాఖ్య‌లు: పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక‌ త‌ప్ప‌దు

అమ‌రీంద‌ర్ సింగ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొని తిరిగి పంజాబ్ చేరుకున్నారు.  పంజాబ్‌లో నెల‌కొన్న అనిశ్చితి ప‌రిస్థితిపై ఆయ‌న కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేన‌ని, కాంగ్రెస్ పార్టీలో ప్ర‌స్తుతం అనిశ్చితి ప‌రిస్థితి నెల‌కొంద‌ని అన్నారు.  అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీని కోల్పోతే స్పీక‌ర్ తగిన నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.  ఇప్ప‌టికే పార్టీలో సిద్ధూని అనేక మంది వ్య‌తిరేకిస్తున్నార‌ని, నిల‌క‌డ లేని మ‌న‌స్థ‌త్వం క‌లిగిన వ్య‌క్తితో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం మ‌నుగ‌డ సాగించ‌లేద‌ని ప్ర‌తిపక్షాలు చెబుతున్న సంగ‌తి తెలిసిందే.  ఇప్పుడు కాంగ్రెస్‌లో ముఖ్య‌నేత అమ‌రీంద‌ర్ సింగ్ ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డంతో ఆ పార్టీ మ‌రింత ఇబ్బందుల్లో ప‌డిపోయింద‌ని చెప్పాలి.  కాంగ్రెస్ త‌ర‌పున సిద్ధూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ఆయ‌న్ను ఓడించేందుకు త‌ప్ప‌కుండా ప్ర‌య‌త్నం చేస్తామ‌ని అమ‌రీంద‌ర్ సింగ్ పేర్కొన్నారు.  ఈ వ్యాఖ్య‌లు చూస్తుంటే పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక‌లు త‌ప్ప‌వ‌నే సంకేతాలు క‌న‌బ‌డుతున్నాయి.  ఒక‌వేళ కాంగ్రెస్‌లో చీలిక‌లు వ‌స్తే పార్టీ ఎలా ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటుందో చూడాలి.  

Read: ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టునుంచి వైఎస్ ష‌ర్మిల‌కు ఊర‌ట‌…

-Advertisement-అమ‌రీంద‌ర్ సింగ్ సంచల‌న వ్యాఖ్య‌లు:  పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక‌ త‌ప్ప‌దు

Related Articles

Latest Articles