అలుపెరుగక సాగుతున్న అమరావతి పాదయాత్ర@24రోజులు

అమరావతి రాజధాని పరిరక్షణే ధ్యేయంగా అమరావతి రైతులు, రైతు సంఘాలు, మహిళలు, వైసీపీయేతర పార్టీలు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర 24 రోజులుగా అవిశ్రాంతంగా సాగుతోంది. ఏపీ రాజధాని పరిరక్షణ కోసం అలుపెరగని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు, మహిళలకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. 24 రోజులుగా యాత్ర చేసి కాళ్లు బొబ్బలెక్కిన మహిళలకు నరసరావుపేటలో అపూర్వ గౌరవం లభించింది. టీడీపీ ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్‌బాబు పాలాభిషేకం చేశారు. నిర్విఘ్నంగా ముందుకు సాగాలంటూ కాళ్లను పాలతో అభిషేకించారు.

ఈ పాదయాత్రకు తనవంతుగా రూ.3లక్షల విరాళం అందజేశారు అరవింద్ బాబు. నెల్లూరు జిల్లా టీడీపీ నేత బీద రవిచంద్ర కూడా మహాపాదయాత్రకు రూ.3లక్షలు అందించారు. ఇవాళ నెల్లూరు జిల్లా సున్నంబట్టి నుంచి మొదలైన పాదయాత్ర రాజుపాలెం వరకు 15కి.మీ. మేర సాగనుంది. ఈ యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా తిరుమలకు చేరనుంది. మూడు రాజధానులు వద్దు-అమరావతి ఏకైక రాజధాని ముద్దు అంటూ నినదిస్తున్నారు.

Related Articles

Latest Articles