ఆదివారం డ్రామా జూనియర్స్ షోలో ఆమని హంగామా!

నటి ఆమని ఇప్పుడంటే అమ్మ పాత్రలు పోషిస్తోంది కానీ ఇరవై ఐదేళ్ళ క్రితం అందాల నాయికగా, అభినయ తారగా రాణించింది. మరీ ముఖ్యంగా కె. విశ్వనాథ్, బాపు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలలో నటించి, తన అభినయంతో ఆకట్టుకుంది. జీ తెలుగు ఛానెల్ లో జరుగుతున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ కు ఇటీవల ఆమని గెస్ట్ గా హాజరైంది. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఈ షోకు కుటుంబ కథా చిత్రాల దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ హాస్య నటుడు ఆలీ, ప్రఖ్యాత నేపథ్య గాయని సునీత న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

Read Also : ఇండియన్ ఐడల్ 12 విజేత అతగాడేనా!?

ఆగస్ట్ 1 ఆదివారం రాత్రి ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో ఆమని ప్రత్యేక అతిథి పాల్గొన్నారు. అంతేకాదు… వ్యాఖ్యాత ప్రదీప్ తో కలిసి ‘శుభలగ్నం’ సినిమాలోని ‘పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసులపేరు చూడు’ అనే పాటకు స్టేజ్ పై డాన్స్ చేయడం ఓ విశేషం. స్టార్ యాంకర్ ప్రదీప్ తనదైన శైలిలో స్పాంటేనియస్ గా పంచ్ లు వేస్తూ, కార్యక్రమాన్ని ఆద్యంతం ఆకట్టుకునేలా నిర్వహిస్తున్నాడు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-