ఒక డైరెక్టర్ కి విడాకులిచ్చి.. మరో డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిన హీరోయిన్

ప్రేమ ఖైదీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ అమలా పాల్. ఈ సినిమా తరువాత బ్లాక్ బ్యూటీ కి టాలీవుడ్ లో అవకాశాలు బాగానే తలుపులు తెరిచాయి. స్టార్ హీరోల సరసం నటిస్తూనే డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక బంధం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మారింది. విబేధాల కారణంగా అమలా, విజయ్ లు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల అనంతరం బోల్డ్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తయారైన అమలా ఆమె చిత్రంలో నగ్నంగా నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో బోల్డ్ స్క్రిప్ట్ కి రెడీ అయ్యింది. అమలాపాల్ మరియు తాహిర్ రాజ్ బసీన్ లు కీలక పాత్రల్లో తెరకెక్కిన హిందీ వెబ్ సిరీస్ రంజిష్ హీ సహీ. ఈ వెబ్ సిరీస్ నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ సినిమా హిందీ దర్శకుడు మహేష్ భట్ జీవిత కథగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో అమలా పాల్, మహేష్ భట్ కాపురంలో చిచ్చుపెట్టే సింగర్ గా కనిపించనుంది. అంతేకాకుండా ఆ పాత్ర కోసం కొద్దిగా బోల్డ్ సీన్లలలో కూడా నటించింది కూడా. సిగరెట్, మద్యం తో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నదంట. ఈ సిరీస్ ట్రైలర్ చూసినవారందరు కూడా ఎప్పుడెప్పుడు స్ట్రీమ్ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నారంటే.. ఈ సిరీస్ బాగా ఆసక్తి క్రియేట్ చేసిందని అర్ధం. మరి ఈ సిరీస్ తో అమ్మడు హిందీలో పాతుకుపోతుందేమో చూడాలి.

Related Articles

Latest Articles