డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ‘అం అః’

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘అం అః’. ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ అనేది ట్యాగ్‌లైన్‌. శ్యామ్ మండ‌ల దర్శకత్వంలో జోరిగె శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. మంగళవారం ఈ సినిమా పోస్టర్ ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీనివాస్, దర్శకుడు శ్యామ్, హీరో సుధాకర్, సినిమాటోగ్రాఫర్ శివారెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ పళని స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ”మూవీ టైటిల్ చాలా బావుంది. ఇది వ‌ర‌కు నేను కూడా ‘అ ఆ ఇ ఈ’ అనే టైటిల్‌తో సినిమా చేశాను. ఇప్పుడు ‘అం అః’ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట‌ర్ శ్యామ్ మండ‌ల‌, నిర్మాత శ్రీనివాస్‌గారు, హీరో సుధాక‌ర్ ఓ టీమ్‌గా ఏర్ప‌డి మంచి కంటెంట్‌తో ఈ సినిమా చేయ‌డం హ్యాపీగా ఉంది” అని అన్నారు.

ద‌ర్శ‌కుడు శ్యామ్ మండ‌ల మాట్లాడుతూ ‘‘క‌రోనా సమయంలోనూ నిర్మాత శ్రీనివాస్‌గారు ఇచ్చిన స‌పోర్ట్‌తో ‘అం అః’ సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశాను. అంతకు ముందు ఆయ‌నిచ్చిన స‌పోర్ట్‌తోనే “ట్రూ” అనే సినిమాను కూడా పూర్తి చేశాను. ఈ చిత్రాలను తెరకెక్కించే క్రమంలో నేను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా శ్రీనివాస్ గారు బెస్ట్ అందించారు. సినిమా కథ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌. సినిమాటోగ్రాఫ‌ర్ శివ‌గారి స‌పోర్ట్‌తో మంచి ఔట్‌పుట్‌ను తీసుకొచ్చాం. లైన్ ప్రొడ్యూస‌ర్ ప‌ళ‌నిగారికి థాంక్స్‌. ఆయ‌న ప్రాజెక్ట్‌ను చ‌క్క‌గా ఎగ్జిక్యూట్ చేశారు. హీరో సుధాక‌ర్ కంటెంట్‌ను న‌మ్మి వ‌ర్క్ షాప్ చేసి చ‌క్క‌టి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ టీమ్‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ‘అం అః’

Related Articles

Latest Articles

-Advertisement-