మెడ పట్టీతో మెగా హీరో… వ్యాయామం చేస్తుండగా గాయం…

వెండితెరపై హీరోగా కనిపించటం అంటే బాధ్యత మాత్రమే కాదు. బరువు కూడా! అందుకే, మన హీరోలు… ఆ మాటకొస్తే ఈ తరం హీరోయిన్స్ కూడా… రోజూ జిమ్ లో బరువులు ఎత్తుతుంటారు. కఠినమైన కసరత్తుల వల్ల ఫిట్ నెస్ మాత్రమే కాక మంచి లుక్ కూడా వస్తుంది. యంగ్ హీరోలకి నటన కంటే కూడా కండలు తిరిగిన చక్కటి శరీరం చాలా ముఖ్యం. అదుంటే యూత్ ఆటోమేటిక్ గా ఓ లుక్ వేస్తారు. ఆ తరువాత టాలెంట్ తో అట్రాక్ట్ చేయవచ్చు…

మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీశ్ కూడా తన నెక్ట్స్ మూవీలో పర్ఫెక్ట్ లుక్ తో ఆకట్టుకుందాం అనుకున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ ల విషయంలో ఎప్పుడో కుర్రాళ్లకి పిచ్చెక్కించేశారు. ‘గనీ’ భాయ్ వరుణ్ తేజ్ కూడా బాక్సార్ గా మారేందుకు జిమ్ లో హల్ చల్ చేస్తున్నాడు. వాళ్ల బాటలోనే శిరీశ్ కూడా బాధ్యతగా బరువులు ఎత్తాడు! బైసిప్స్, ట్రైసిప్స్, యాబ్స్, ఫోర్ ఆమ్స్ లాంటివన్నీ ఇనుమడించేలా శ్రమ పడ్డాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఇంకేముంది వ్యాయామంలో గాయంతో శిరీశ్ మెడకు పట్టీ బిగుసుకుంది. ఆ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేశాడు యంగ్ హీరో….

‘‘ఫ్యాషన్ కోసం ధరించిందైతే కాదు! స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సమయంలో మెడకు గాయమైంది…’’ అంటూ శిరీశ్ క్యాప్షన్ రాశాడు తన లెటెస్ట్ పిక్ కి! ఇక ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ చేస్తోన్న మూవీ ‘ప్రేమ కాదంట’. లివిన్ రిలేషన్ షిప్స్ ఆధారంగా సాగే కథతో ఈ మూవీ రూపొందుతోంది. రాకేశ్ శశి డైరెక్టర్ కాగా అనూ ఇమ్మాన్యుయల్ ఫీమేల్ లీడ్…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-