“పుష్ప”రాజ్ ట్రైలర్ లోడింగ్… ప్రోగ్రెస్ లో పనులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ లేడీ రష్మిక మందన్న, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ నటించిన సుకుమార్ మాగ్నమ్ ఓపస్ “పుష్ప : ది రైజ్” విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో “పుష్ప” ట్రైలర్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం “పుష్ప: రైజ్ ట్రైలర్” కట్‌లు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘పుష్ప’ ట్రైలర్ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.

Read Also : ‘పుష్ప’ టీజర్.. ఆల్‌టైమ్ రికార్డు

కొన్ని రోజుల క్రితం మేకర్స్ అల్లు అర్జున్ కొన్ని మాస్ డైలాగ్‌లు చెప్పడానికి డబ్బింగ్ స్టూడియోకి వెళుతున్న వీడియోను పంచుకున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ అనే కూలీగా మారిన స్మగ్లర్ పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తున్నారు. పాన్ ఇండియన్ ఫిల్మ్ “పుష్ప: ది రైజ్”లో సమంత రూత్ ప్రభు ఈ చిత్రంలో ఒక ప్రత్యేక సాంగ్ చేయబోతున్నారు.

Related Articles

Latest Articles