‘పుష్ప’ సెకండ్ సింగిల్ ప్లాన్ చేశారు

పుష్ప సినిమా నుంచి వచ్చిన ‘దాక్కో దాక్కో మేక’ మొదటి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కాలే కడుపు సూడదురో నీతి న్యాయం.. బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టా రాజ్యం’ అనే లిరిక్స్ ను చంద్రబోస్ అద్భుతంగా రాశారు.. సింగర్ శివమ్ ఆలపించగా.. దేవిశ్రీ మ్యూజిక్ ఆపై అల్లు అర్జున్ గెటప్ ఈ పాటలో హైలైట్ నిలిచాయి. ఇక సెకండ్ సింగిల్ కూడా భిన్నంగా ప్లాన్ చేసారని తెలుస్తోంది. కథానాయికకు సంబందించిన సాంగ్ గా ఉండనున్నట్లు వినిపిస్తోంది. వినాయకచవితి సందర్బంగా రెండో పాటను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ శరవేగంగా జరుపుకోంటుంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ముఖ్యంగా ఫాహద్ ఫాజిల్ కాంబినేషన్లోని సన్నివేశాలను షూట్ చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన కథానాయికగా నటిస్తోంది. క్రిస్మస్ సందర్బంగా ఈ సినిమాను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-