‘పుష్ప’ డిసెంబర్ కి వెళుతున్నాడా!?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప’. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ బాషల్లో భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. రశ్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, ధనుంజయ్ ముఖ్యపాత్రధారులు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగస్ట్ రేస్ నుంచి డిసెంబర్ కు షిఫ్ట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఈ పుకారు నిజమో కాదో తెలియాల్సి ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-